వెంటనే స్పందించి మరమ్మతులు చేయించిన కౌన్సిలర్
KMM: మధిర పట్టణంలోని 22 వార్డు సుశీల జూనియర్ కాలేజీ సమీపంలో 11 కే విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. కరెంట్ తీగలతో ప్రమాదం పొంచి ఉండటంతో మధిర పట్టణం 22వ వార్డు ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఆ ప్రాంత స్థానికులు ఆ వార్డు కౌన్సిలర్ ధారా నాగార్జునకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నాగార్జున విద్యుత్ అధికారులచే మరమ్మతులు చేయించారు.