భార్య అక్క తిట్టిందని ట్యాంక్ ఎక్కి నిరసన
SRCL: వేములవాడకు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన మూడవ భార్య అక్క తిట్టిందని మనస్తాపం చెంది ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. అయితే తనను తిట్టిన మూడవ భార్య అక్క స్వయంగా వచ్చి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశాడు. మూడు గంటల పాటు అధికారులకు చుక్కలు చూపించగా, చివరకు డీఎస్పీ శ్రీనివాసులు జోక్యం చేసుకుని, సదరు మహిళతో క్షమాపణ చెప్పిస్తామని హామీ ఇవ్వడంతో అశోక్ కిందికి దిగాడు.