ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీలో నూతనంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యతను పరీక్షించి, నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.