పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎస్పీ

పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎస్పీ

SRCL: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గితే జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రశాంతంగా ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.