సోషల్ మీడియాతో ప్రజలకు చేరువ కావాలి: వాసుపల్లి
VSP: బూత్ స్థాయి నుంచే వైసీపీ సోషల్ మీడియాను బలోపేతం చేయాలని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆశీలమెట్ట కార్యాలయంలో సౌత్ సోషల్ మీడియా బృందంతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన నవరత్నాల సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేదన్నారు.