ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: అంబానీ
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ విజయంపై రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ స్పందించారు. భారత ప్లేయర్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగేలా చేశారని కొనియాడారు. ఈ గెలుపు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొలి ప్రంపచకప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.