నూతన జీకేవీధి MEO-1గా గోవింద పడాల్

నూతన జీకేవీధి MEO-1గా గోవింద పడాల్

ASR: జీకేవీధి ఎంఈవో-1గా దేశగిరి గోవింద పడాల్ మంగళవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎంఈవోగా పనిచేసిన సత్యనారాయణ అనారోగ్యంతో సెలవు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో ఎంఈవో-1గా పెదవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోవింద పడాల్‌ను నియమించారు. నూతన MEO గోవింద పడాల్‌ను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.