APK ఫైల్ నొక్కగానే రూ. 1.09 లక్షలు మాయం

APK ఫైల్ నొక్కగానే రూ. 1.09 లక్షలు మాయం

MDCL: 75 ఏళ్ల హబ్సిగూడ వ్యక్తి ఫేస్‌బుక్‌లోని నకిలీ డీమార్ట్ ఆఫర్‌ ప్రకటనను నమ్మి రూ. 1,09,610 సైబర్ మోసానికి గురయ్యారు. ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం పంపిన APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి, SBI క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చేయడంతో మోసగాళ్లు ఫోన్‌‌పై నియంత్రణ పొంది OTPలతో మూడు ట్రాన్సాక్షన్లు చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన కార్డులను బ్లాక్ చేశారు.