సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా: ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా: ఎమ్మెల్యే

కృష్ణా: పేదలకు సీఎం సహాయ నిధితో భరోసా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 49 మందికి రూ.30,34,948లను చెక్కుల రూపంలో అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి నియోజకవర్గంలో 758 మందికి రూ. 5,88,94,252 సహాయం అందించినట్లు వివరించారు.