మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి ఆలయం
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఉద్యోగులు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.