ఆసుపత్రి అభివృద్ధికి రూ.5 కోట్ల CSR నిధులు
NLR: కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రూ.5 కోట్ల CSR నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ఆసుపత్రుల లక్ష్యమని, వైద్యులు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని సూచించారు.