మేడ్చల్ మున్సిపోల్.. 68 వార్డులు

మేడ్చల్ మున్సిపోల్.. 68 వార్డులు

MDCL: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 68 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల కోసం ఎన్నికల నిర్వహణలో భాగంగా 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,866 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఓటరికి సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.