యువత తనలో ఉన్న ప్రతిభను గుర్తించాలి: కలెక్టర్ రాజర్షి షా
ADB: యువత తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉపాధి అవకాశాలను సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 'కళా అకాడమీ' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అకాడమీలో గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, AI ఆధారిత కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారని నిర్వాహకులు కలెక్టర్‌తో వివరించారు.