చిరుతపులి కలకలం.. గ్రామస్తుల ఆందోళన

NRML: తానూర్ మండలంలోని ఝరి(బి) గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. బెంబెర్ రహదారిపై చిరుత తిరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.