ముగ్గురు జీపీ కార్యదర్శులు SUSPEND
NGKL: నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ బీ. సంతోష్ సస్పెండ్ చేశారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన పి. కిషన్, కొల్లాపూర్ మండలం సింగోటం కార్యదర్శి పి. అర్జునయ్య, అంకిరావుపల్లికి చెందిన ఆర్. ప్రేమచంద్‌లపై ఈ వేటు పడింది. పర్యవేక్షణలో విఫలమైన వంగూరు, కొల్లాపూర్ ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.