నేడు కడప జిల్లాకు మంత్రి ఆనం రాక

KDP: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం10 గంటలకు బ్రహ్మంగారి మఠం చేరుకుంటారని అక్కడ బ్రహ్మంగారి ఆలయంతోపాటు ఆలయాలను సందర్శిస్తారన్నారు. స్థానికంగా అధికారులతో సమావేశం అవుతారని చెప్పారు.