మాజీ అధ్యక్షుడు మృతి.. మోదీ దిగ్బ్రాంతి
సూరినామ్ దేశ మాజీ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖి హఠాన్మరణం పట్ల PM మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సూరినామ్‌కే కాకుండా ప్రపంచవ్యాప్త భారత సంతతికి తీరని లోటని పేర్కొన్నారు. గతంలో ఆయన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తీరును గుర్తు చేసుకుంటూ, భారత సంస్కృతిపై ఆయనకున్న మక్కువను మోదీ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.