గతేడాది పొరపాట్లను మళ్లీ చేయం: అక్షర్ పటేల్

గతేడాది పొరపాట్లను మళ్లీ చేయం: అక్షర్ పటేల్

IPL 2025 సీజన్‌లో ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. చివరికి ప్లేఆఫ్స్ చేరుకోలేకపోయింది. ఈసారి కూడా ఇబ్బంది పడుతుందా? అనే ప్రశ్నకు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. 'ఇది సుదీర్ఘమైన టోర్నీ. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టిపెడుతూ ముందుకెళ్లాలి. ఈసారి కూడా మేం మంచిగానే ఆరంభించాం. అదే కొనసాగిస్తాం. గతేడాది పొరపాట్లను పునరావృతం కానివ్వం' అని అక్షర్ తెలిపాడు.