CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు అయిన రూ. 9,62,293 లక్షల విలువగల చెక్కులను గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు 13 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పాలిట వరమని తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.