గుంతలో పడి చిన్నారి మృతి
NRML: ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలో పడి చిన్నారి నాగపుష్ప(6) మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్ (D) పెంబి (M) వేనునగర్‌లో జరిగింది. ఎస్సై హన్మాండ్లు వివరాల ప్రకారం.. ఆత్రం రాము-రేణుక దంపతుల కుమార్తె నాగపుష్ప శనివారం సాయంత్రం అంగన్వాడీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందింది.