తెనాలిలో ఏపి షార్ట్ ఫిలిం ఫెస్టివల్ విధి విధానాలు విడుదల
GNTR: ఔత్సాహిక యువతి, యువకులకు ప్రోత్సహకరంగా 2026 జనవరి 4న తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిలిం ఫెస్టివల్ విధి విధానాలను 'మా-ఏపీ' సంస్థ విడుదల చేసింది. కన్వీనర్ దిలీప్ రాజా పోటీల నియమ నిబంధనలు శనివారం తెలియజేశారు. గతంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రసారం చేసిన షార్ట్ ఫిల్మ్‌లు పోటీలకు అనర్హతగా ప్రకటించడమైనదని పేర్కొన్నారు.