గుర్తు తెలియని APK ఫైల్‌లను క్లిక్ చేయవద్దు

గుర్తు తెలియని APK ఫైల్‌లను క్లిక్ చేయవద్దు

KDP: గుర్తు తెలియని APK ఫైల్‌లను క్లిక్ చేయవద్దని కడప ఎస్పీ ఇ.జి.అశోక్ కుమార్ హెచ్చరించారు. శనివారం కడపలో ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్ళు గుర్తుతెలియని ఏపీకే ఫైల్స్ ద్వారా ఫోన్, వాట్సాప్ హ్యాక్ చేసి వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు దొంగిలిస్తారని చెప్పారు. ప్లే‌స్టోర్ తప్ప ఇతర వేదికల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని తెలిపారు.