ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం

WNP: ఆత్మకూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు కంటి వైద్యుడు దేవేంద్రనాథ్ గురువారం తెలిపారు. ఇప్పటి వరకు 17 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి మహబూబ్‌నగర్ ఏనుగొండలోని రామ్ రెడ్డి కంటి వైద్యశాలకు తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్‌లు చేయించనున్నట్లు తెలిపారు.