కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

GDWL: మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి జయపాల్‌కు చెందిన ఎద్దు బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. కట్టివేసి ఉంచిన ఎద్దు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైపు కదలడంతో వైర్లు తగిలి మరణించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చనిపోయిన ఎద్దు విలువ దాదాపు రూ. 70,000 ఉందన్నారు.