'గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి'
ADB: గుడిహత్నూర్ మండలంలోని దంపూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని డంపింగ్ యార్డ్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. ఈ మేరకు గజేందర్ సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.