రేపు సీతారాముల కళ్యాణోత్సవం
VKB: దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్‌లో రేపు శ్రీ శ్రీ శ్రీ వాదంకుంట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అలాగే, సీతారాముల కళ్యానోత్సవం జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ మల్లమ్మ తెలిపారు. ఈ మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.