మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు శరద్‌పవార్
మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్థిగా శరద్‌పవార్ ఎంపికయ్యారు. ఆయన అభ్యర్థిత్వంపై MVA నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, తొలుత శివసేన (UBT), కాంగ్రెస్ ఈ స్థానం కోసం పట్టుబట్టింది. కానీ, శరద్ పవార్‌ను బరిలోకి దించడం వల్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని భావించి అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.