డిప్యూటీ MROకు వినతి పత్రం అందజేత..

BHPL: భూపాలపల్లి BJP రూరల్ మండల అధ్యక్షుడు పులిగుజ్జ రాజు ఆధ్వర్యంలో డిప్యూటీ ఎమ్మార్వోకు ప్రజా సమస్యలపై శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ.. రైతులకు పట్టాలు, యూరియా, నష్టపరిహారం, అంతర్గత రోడ్లు, ఆజం నగర్‌కు బస్సులు, గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరారు.