తల్లి సర్పంచ్.. కూతురు మేయర్

తల్లి సర్పంచ్.. కూతురు మేయర్

NLG: ప్రజాసేవలో తల్లీకూతురు ఉన్నత పదవులు చేపట్టి అరుదైన గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో తల్లి సరోజ రామన్నపేట మండలం జనంపల్లి సర్పంచ్ గెలిచారు. తాజాగా వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో ఆమె కూతురు బుర్రి చైతన్య నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒకే కుటుంబంలో తల్లి సర్పంచ్‌గా, కూతురు మేయర్‌గా సేవలు అందించనున్నారు.