బుధవారం నుంచి గ్రామ సభల నిర్వహణ

KDP: ముద్దనూరు మండలంలో 19 గ్రామ పంచాయతీలలో P4 సర్వేలలో భాగంగా గ్రామ సభలో నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో అధికారి రాధాకృష్ణవేణి మంగళవారం తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీలలో ఆగస్టు 5వ తేదీ వరకు కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సభలో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. అధికారులు తప్పక గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఎంపీడీవో అన్నారు.