నేడు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్న ఎమ్మెల్యే

MBNR: ఎస్సై, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ, వీఆర్ఎ, వీఆర్వో, గ్రూప్ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఫ్రీ కోచింగ్ క్లాసులను ప్రారంభించనున్నారు. ఆయన సొంత నిధులతో బుధవారం ఉచితంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.