ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండల కేంద్రంలోని జామియా మసీదులో గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ నెల సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు, పెద్దలకు పండ్లను అందించి వారి ఉపవాసాన్ని గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు.