VIDEO: లారీ బీభత్సం.. ఐదు గొర్రెలు మృతి

KMM: కూసుమంచి మండలం నాయకనూడెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని గాయపడ్డాయి. గ్రామానికి చెందిన చెట్ల శ్రీను తన గొర్రెలను మేతకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గొర్రెలు మృతి చెందడంతో కాపరి కన్నీరుమున్నీరవుతున్నాడు.