'ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు ఇవ్వచ్చు'

అన్నమయ్య: ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అదనపు ఎస్పీ వై. వెంకటాద్రి ఆదేశించారు. సోమవారం రాయచోటి పోలీస్ కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఈ మేరకు అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ.. త్వరితగతిన పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు ఇవ్వచ్చని సూచించారు.