ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDL: జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపులను బుధవారం కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రిజిస్టర్, స్టాక్‌ను పరిశీలించి రైతులకు అవసరమైనంత మేరకే యూరియా అందజేయాలని షాపు యజమానులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.