ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు ఆరంభం
ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సాయంత్రం గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి వెండి రథోత్సవం భక్తుల మధ్య వైభవంగా జరిగింది. అధికారులు రథాన్ని ప్రారంభించగా, డప్పు, భజనలు, కోలాటాలతో శివనామస్మరణ మారుమోగింది. రథం బ్రాహ్మణ వీధి నుంచి కొత్తపేట వరకు సాగింది.