VIDEO: ఒకేచోట 4 వాహనాల బీభత్సం
ప్రకాశం: దర్శిలోని అద్దంకి రోడ్డులో శుక్రవారం రాత్రి ఒకేచోట 2 ప్రమాదాలు జరిగాయి. పొగాకు లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్దిసేపటికే అదే ప్రాంతంలో ఓ లారీని అతివేగంగా వచ్చిన మరో బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ఆటో, బొలెరో వాహనాల్లోని ఇద్దరికి తేలికపాటి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.