నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: జైపూర్ మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మతు పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మిట్టపల్లి, కాన్కూర్, ముదిగుంట, రసూల్ పల్లి, దుబ్బపల్లి, వెంకటరావుపల్లి, జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల్లో పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.