బీసీ గురుకులానికి సొంత భవనం నిర్మించాలి: MLA ముప్పిడి
తూ.గో: కొవ్వూరులోని బీసీ గురుకుల పాఠశాలకు తక్షణమే స్థలం కేటాయించి, సొంత భవనం నిర్మించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 2018లో మంజూరైన ఈ పాఠశాల నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.