ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SP

WNP: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. మట్టి మిద్దెలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివాసం ఉండొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దన్నారు.