'చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దు'

'చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దు'

HYD: బంజారాహిల్స్ రోడ్ నం.10లో చిరువ్యాపారులు జీవిస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్‌రెడ్డి పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఫుట్‌పాత్ వ్యాపారులతో ఆయన ఏసీపీని కలిసి సమస్యను వివరించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటారని తెలిపారు.