ఎరువుల దుకాణాలు తనిఖీ
MDK: తూప్రాన్ మున్సిపాలిటీలో ఎరువుల దుకాణాలను ఆర్డీవో జయచంద్రారెడ్డి తనిఖీ చేశారు. నిల్వలు, విక్రయాల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ యాప్ వాడకంతో బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట పడిందని, పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు. యాప్ ద్వారా లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయని యజమానులు ఆర్డీవోకు తెలిపారు.