'ఎకరాకు రూ.40,000 నష్ట పరిహారం చెల్లించాలి'
ప్రకాశం: మోంథా తుఫానుతో వెలిగండ్ల మండలంలో దెబ్బతిన్న సజ్జ పంటను కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పరిశీలించారు. పూలికుంట్ల గ్రామంలో కల్లాల్లో ఉన్న, కోత కోసిన సజ్జ పంట వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. దద్దాల మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎకరాకు రూ.40,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు.