రెండు రోజులు పవర్ కట్
ELR: జీలుగుమిల్లి 11KV టౌన్ ఫీడర్ బ్రేకర్ మరమ్మతులు కారణంగా నవంబర్ 28, 29 తేదీల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 4-5 గంటల మధ్య సరఫరా ఉండదన్నారు. జీలుగుమిల్లితో పాటు వంకవారిగూడెం, బర్రింకలపాడు, ఎర్రవరం, వాడపల్లి సహా పలు గ్రామాలకు ప్రభావం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు