'పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'
పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవితా కేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. పక్కన ఉన్న రేకుల షెడ్డును కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.