VIDEO: మొక్కజొన్న కేంద్రాల కోసం రైతుల విజ్ఞప్తి

VIDEO: మొక్కజొన్న కేంద్రాల కోసం రైతుల విజ్ఞప్తి

GDWL: ఉమ్మడి ఇటిక్యాల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కేంద్రాలు లేకపోవడంతో పంటను పొలాలు, ప్రైవేట్ ప్రదేశాలు, రోడ్లపై నిల్వ చేస్తున్నామని తెలిపారు. అకాల వర్షాలు కురిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.