వాసర్ వంతెనను పరిశీలించిన ఖేడ్ డీఎస్పీ

SRD: సిర్గాపూర్ మండలంలోని వాసర్ గ్రామ శివారులోని వంతెనను ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి సోమవారం సందర్శించారు. భారీ వర్షానికి వంతెన పైనుంచి వరద జలాలు ప్రవహించి దెబ్బతిన్న ఈ రోడ్డును స్థానిక తహసీల్దార్ హేమంత్ కుమార్ ఎస్సై మహేష్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలు ఇప్పటికైనా భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.