తిరువూరులో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
NTR: తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఓ కారు పోలం నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.