VIDEO: పంచాయతీ ఎన్నికల కోసం ఇంత బందోబస్తా..!
JN: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గమైన పాలకుర్తిలోని చర్లపాలెం పంచాయతీలో ఎన్నికల కోసం భారీగా బందోబస్తును మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.