షాబాద్ రహదారి బాగు చేయాలంటూ డిమాండ్..!
GDWL: ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామ శివారులోని రహదారి దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటరు మేర కంకర తేలి రోడ్డు పూర్తిగా దెబ్బతిందని స్థానికులు తెలిపారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలో శాంతినగర్‌కు వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే మరమ్మతులు చేసి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.